మింట్ పలావ్

Durga
 కావసిన పధార్ధాలు : బాస్మతి బియ్యం : ఒక కిలో పుదీనా : పది కట్టలు కొత్తిమీర : ఐదు కట్టలు పచ్చిమిర్చి: ఎనిమిది నెయ్యి లేదా డాల్డా : వంద గ్రా. ఉల్లిపాయలు: నాలుగు అల్లంవెల్లుల్లి ముద్ద : మూడు టీస్పూన్లు యాలకులు : నాలుగు లవంగాలు : పదిహేను పలావ్ ఆకులు : నాలుగు ఉప్పు : తగినంత తయారీ విధానం : బియ్యం కడిగి నానబెట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ప్రెషర్‌పాన్‌ను తీసుకుని స్టవ్‌మీద పెట్టాలి. నెయ్యి లేదా డాల్డా వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ముదురు బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. అదే బాణలిలో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, పలావ్‌ ఆకులు వేసి కొద్దిసేపు వేగాక, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర విడిగా తీసి ఉంచాక... మిగిలిన పుదీనా, కొత్తిమీరలతో కలిపి మెత్తగా నూరిన పచ్చిమిర్చి ముద్దను కూడా వేసి వేయించాలి. తరవాత నానబెట్టిన బియ్యం వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి. సరిపడా నీళ్లు పోసి, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. చివరిగా.. దించేముందు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు కలిపితే బాస్మతి మింట్ పలావ్ రెడీ అయినట్లే..!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: